
Table of Contents
Subsidy Scheme
Subsidy Scheme :: ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు గుడ్ న్యూస్! రైతులందరూ 100 శాతం సబ్సిడీ పొందవచ్చు. అయితే ఈ సబ్సిడీ పొందడానికి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview of the Subsidy Scheme
మన రాష్ట్రంలోని రైతులను అభివృద్ధి చేస్తూ వారికి ఎల్లప్పుడూ తోడు ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంది. అందులో భాగంగా రైతులకు ప్రతి సంవత్సరం ఇచ్చే సబ్సిడీ శాతం ను కూడా పెంచుతూ ఉంది. అలాగే రైతులు చేసే బిందు సేద్యం మరియు తుంపర సేద్యం లో ఉపయోగించే పరికరాలను అందించడం కోసం ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకుంది. మనదేశంలో సూక్ష్మ సేద్యం చేసే దానిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Fy25 లో 1.17L హెక్టార్లలో ఈ సేద్యాన్ని అమలు చేసింది. అయితే మన రాష్ట్రంలో ఎక్కువగా చిన్న మరియు సన్నకారు రైతులే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నా మరియు సన్నకారు రైతులకు 90 శాతం నుండి 100 శాతం వరకు సబ్సిడీతో బిందు సేద్యం మరియు తుంపర సేద్యం లో ఉపయోగించే పరికరాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కర్నూలు జిల్లా ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని గత ప్రభుత్వం ఈ పరికరాలను 90 శాతం సబ్సిడీతో రైతులకి అందించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సబ్సిడీ ను 90 నుండి 100 శాతానికి పెంచారు. ఇది రైతులకి చాలా ఉపయోగపడుతుంది.
Eligibility For 100% Subsidy
రైతులు వంద శాతం సబ్సిడీని పొందాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను కలిగి ఉండాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- రైతుల యొక్క భూమి ఐదు ఎకరాల లోపు ఉండాలి.
- ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు, SC, ST రైతులు ఈ స్కీం కి అర్హులు అవుతారు.
పైన తెలిపిన అర్హతలను కలిగిన రైతులకు 100 శాతం సబ్సిడీ ను ప్రభుత్వం అందిస్తుంది. అలాగే BC కులాల రైతులకు అయితే 90 శాతం వరకు సబ్సిడీ ను అందిస్తుంది.
ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకి 100 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు, 5 నుండి 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకి 90 శాతం సబ్సిడీ అందజేస్తుంది.అయితే గత ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ ఇస్తుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని 90 శాతం సబ్సిడీ గా పెంచారు. ప్రభుత్వం పాస్ చేసిన 82వ జీవో ప్రకారం అర్హత పొందిన రైతులు అందరూ ఈ స్కీం లో భాగం అవుతారు. అయితే కర్నూలు జిల్లాలో ఇప్పటికే 30,872 రైతులు డ్రిప్పుతోపాటు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని ఉన్న రైతులు కర్నూలు జిల్లాలో ఉన్నారని అధికారులు తెలిపారు. వీరితోపాటు మిగతా రైతులు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ను ఉపయోగించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దీనిని ఉపయోగించుకోవడానికి రైతులు వారి యొక్క సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం లో లేదా దగ్గరలో ఉన్న ఏపీఎంఐపీ కార్యాలయంలో సంప్రదించవచ్చు అని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Benifits Of Drip Irrigation
చాలామంది రైతులు ఇంకా ఏం చేయడానికి పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కానీ దానికన్నా కూడా డ్రిప్ ఇరిగేషన్ చేయడం వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ఉపయోగాల ను ఇప్పుడు తెలుసుకుందాం.
- డ్రిప్ ఇరిగేషన్ చేయడం వలన నీటిని పొదుపు చేయవచ్చును.
- ఈ పద్ధతి ద్వారా ప్రతి మొక్కకు కావలసిన నీటిని మాత్రమే నేరుగా ఆ మొక్క యొక్క వేరుకు అందించవచ్చును.
- డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 40 శాతం నుండి 60 శాతం వరకు నీటిని పొదుపు చేయవచ్చును.
- అలాగే నీటితో పాటు ఎరువులు కూడా అవసరమైన మోతాదులో మొక్క యొక్క వేరుకు అందించవచ్చు.
Also Read :- 50% రాయితీతో కొత్త కార్డులు రిలీజ్
ఇలా ఈ పద్ధతిని అమలు చేయడం వలన ఎరువులను మొక్కకు అవసరమైన మోతాదులో అందించడం తో పాటు ఎరువుల యొక్క వినియోగాన్ని తగ్గించవచ్చు. దీనివలన మొక్క ఆరోగ్యంతో పాటు బలంగా ఉంటుంది. అప్పుడు కలుపు మొక్కలు కూడా దీని చుట్టూ పెరగవు. ఇలా అన్నింటిని బ్యాలెన్స్ గా మొక్కకు అందించడం వలన మొక్క యొక్క ఉత్పత్తి ముందు కంటే కూడా 20 నుండి 30% వరకు పెరుగుతుంది. ఇలా ఆరోగ్యంగా మరియు దృఢంగా పెరిగిన పంట యొక్క నాణ్యత అధికంగా ఉంటుంది. పంట యొక్క నాణ్యత బాగా ఉన్నప్పుడు దాని యొక్క విలువ మార్కెట్లో మంచి ధరలను పలుకుతుంది.
చాలా ఊర్లలో నీరు ఉండక రైతులు బాధపడుతూ ఉంటారు. అలా నీటి కొరత ఉన్న సమయంలో రైతులకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా టమోటా, మిరప, ద్రాక్ష, మామిడి, జామ వంటి పంటలకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ఉపయోగించడం చాలా మంచి ఆప్షన్ అని అధికారులు స్పష్టం చేశారు.
Important Link’s
లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
50% సబ్సిడీతో ప్రభుత్వం ఇచ్చే లోన్స్ | Click Here |
రైతులకు 2000 రిలీజ్ డేట్ | Click Here |
Work From Home Jobs | Click Here |
డిజిటల్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి | Click Here |
Also Read :- రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇదే లాస్ట్
గమనిక :: ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మరియు జాబ్స్ కావాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ నీ లేదా వెబ్ సైట్ ని ఫాలో అవ్వగలరు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇