
Table of Contents
Free Education in Private School in AP
Free Education in Private School in AP :: మీ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించాలని అనుకుంటున్నారా! ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఉచిత ప్రవేశాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview of the Free Education in Private School in AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులను ప్రోత్సహించడానికి మరియు వారికి విద్య పట్ల ఆసక్తిని కలగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రారంభిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రదేశాలలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా చాలామంది ప్రజలు ప్రైవేటు స్కూల్స్ లో వారి పిల్లలని చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. డబ్బులు ఉన్నవాళ్లు వారి పిల్లలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తారు. కానీ నిరుపేద ప్రజలు వారి పిల్లలని చేర్పించలేరు. వీరి కోసమే ప్రభుత్వం బాలల నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం కింద ప్రతి సంవత్సరం నిరుపేద కుటుంబాల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్స్ లో ప్రవేశించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.

అయితే ఈ విద్యా హక్కు చట్టం ద్వారా పేద ప్రజల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు లభిస్తాయి. ఈ సంవత్సరం అనగా 2025-26 కి నిరుపేద పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలకు అప్లై చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఉచితంగా విద్యను అందించే ప్రైవేట్ పాఠశాలలకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లో సదుపాయం కల్పించారు. అలాగే ఈ ఉచిత విద్యని అందించే ప్రైవేట్ పాఠశాలలు వారి యొక్క పూర్తి వివరాలను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో ఏప్రిల్ 19 నుండి 26వ తేదీ లోపల తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Eligibility
ప్రజలు విద్యాహక్కు(RTE) చట్టం ద్వారా వారి పిల్లలని ఉచితంగా ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలంటే కొన్ని అర్హతలను పొంది ఉండాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అవి ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- నిరుపేద కుటుంబాల పిల్లలు మాత్రమే దీనికి అర్హులు అవుతారు.
- ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు.
Age Limit
ఈ అడ్మిషన్స్ కి అప్లై చేయడానికి పిల్లలకు తప్పనిసరిగా ఐదేళ్ల వయస్సు కలిగి ఉండాలి.ఈ అడ్మిషన్స్ ద్వారా వెళ్లే ప్రైవేటు పాఠశాలల్లో స్టేట్,ఐబీ,CBSE, ICSE సిలబస్ లు ఉంటాయి.
- IB,CBSE,ICSE సిలబస్ లు ఉన్న పాఠశాల లోకి ప్రవేశించాలంటే మీ పిల్లల వయసు మార్చి 31,2025 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
- State Syllabus పాఠశాలలో ప్రవేశించడానికి మీ పిల్లల వయసు జూన్ 1,2025 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
Required Documents
ఉచిత ప్రవేశాలకు అప్లై చేయడానికి పిల్లల యొక్క తల్లిదండ్రుల డాక్యుమెంట్స్ కావాలి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- Aadhaar Card
- Voter ID
- Ration Card
- NERGS Card
- Electricity Bill.
How To Apply Free Education in Private School in AP
విద్యార్థులు ఈ ఉచిత ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు. అయితే వీటికి అప్లై చేయడానికి ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్ సైట్ అయిన http://cse.ap.gov.in ద్వారా అప్లై చేయవచ్చును. అలాగే దీనికి సంబంధించిన ఇతర విషయాలు కూడా ఆ వెబ్ సైట్ మీరు చూడవచ్చును.
Important Dates
విద్యార్థులు ఈ ఉచిత ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు.
Application Starting Date : April 28,2025.
Application Last Date : May 15,2025.
✅ Important Links
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన లింక్ ఇవ్వండి జరిగింది.. ఒకసారి చెక్ చేయండి.
ఫ్రీ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ PDF | Click Here |
ఫ్రీ ఎడ్యుకేషన్ అప్లయ్ లింక్ | Click Here |
మరిన్నీ జాబ్స్ కోసం | Click Here |
గమనిక :: ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రభుత్వానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 18004258599 నెంబర్ కి కాల్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు ను.
Important Link’s
లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
50% సబ్సిడీతో ప్రభుత్వం ఇచ్చే లోన్స్ | Click Here |
రైతులకు 2000 రిలీజ్ డేట్ | Click Here |
Work From Home Jobs | Click Here |
డిజిటల్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి | Click Here |
Also Read :- రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇదే లాస్ట్
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇