Free Tailoring Machine: మహిళలకు ఉచితంగా 1 లక్ష కుట్టు మిషన్లు

Free Tailoring Machine

Free Tailoring Machine 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు ( Free Tailoring Machine ) పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు మరేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Overview of Free Tailoring Machine

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి BC, EWS వర్గాలకు చెందిన మహిళలకి టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తామని మంత్రి సవిత తెలిపారు. ఈ మేరకు 1.02 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు వీలుగా 40 – 90 రోజులు ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు.

WhatsApp Group Join Now

Highlights of Free Tailoring Machine

  • ➪ రాష్ట్రవ్యాప్తంగా 1.02 లక్షల మంది మహిళలకు కుట్టు పై ఉచితంగా శిక్షణతోపాటు మిషన్లను అందించనున్నట్లు బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సవిత వెల్లడించారు.
  • ➪ బీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాలకు చెందిన మహిళల ఉపాధి కల్పనకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
  • ➪ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ నెల 8 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
  • ➪ లబ్దిదారుల వీలుకు అనుగుణంగా 45 రోజుల నుంచి 90 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. తొలి విడతగా 46,044 మంది బీసీలకు, 56,788 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు కుట్టుమిషన్లు అందిస్తామని వివరించారు.
  • ➪ ఇందుకోసం ప్రభుత్వం రూ.255 కోట్లు వెచ్చిస్తోందని చెప్పారు.

Free Tailoring Machine Eligibility

  • మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయ్యి ఉండాలి.
  • ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  • కుల దృవీకరణ పత్రం ఉండాలి.
  • వయసు 20 సంవత్సరముల నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు.
  • పట్టణాల్లో 2 లక్షలకు మించరాదు.
  • వితంతువులు, దివ్యాంగ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
  • ట్రైనింగ్ తీసుకునే సమయంలో కచ్చితంగా 70% హాజరు ఉంటే కుట్టు మిషన్ ఇస్తారు.
  • ప్రస్తుతం BC/ EWS కులాలకు చెందినవారు అర్హులు.
  • కుటుంబ వివరాల ప్రాతిపదికన హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ డేటా ఆధారంగా తీసుకునే అవకాశం ఉంది.

2024-2025 సంవత్సరానికి

26 జిల్లాలకు సంబంధించి 175 నియోజకవర్గాలలో ప్రస్తుతానికి మొదటి విడత కింద 60 నియోజకవర్గం లో ఉన్నటువంటి మహిళలకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 వేల్ అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటారు. 3,000 వేల కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది.

శిక్షణ

  • నియోజకవర్గ స్థాయిలో 5 నుంచి 6 శిక్షణ కేంద్రాలలో ఈ శిక్షణ అనేది ఉంటుంది.
  • ఒక శిక్షణ కేంద్రం 30 – 50 మహిళలకు మిషన్ పై శిక్షణ ఇస్తారు.
  • శిక్షణ వ్యవధి 45 రోజుల నుండి 90 రోజుల వరకు ఉంటుంది.
  • ప్రతిరోజు శిక్షణ ఇచ్చే టైములో హాజరు వేయడం జరుగుతుంది.

కావలసిన డాక్యుమెంట్స్?

AP Annadata Sukhibhava Status
AP Annadata Sukhibhava Status: 20 వేలు అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • కుల దృవీకరణ పత్రం
  • మొబైల్ నెంబర్
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  • దరఖాస్తు ఫారం

EWS కింద ఎవరు వస్తారు?

  • కమ్మ
  • కాపు
  • రెడ్డి
  • క్షత్రియ
  • ఆర్యవైశ్య
  • బ్రాహ్మణ

పైన తెలిపిన కులాల వారందరూ EWS పరిధిలోకి వస్తారు.

ఫ్రీ కుట్టు మిషను అప్లికేషన్ ఫామ్

ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి

ఉచిత టైలరింగ్ మిషన్ ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కింద ఇచ్చిన డెమో వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

📽️ Demo Video : Click Here

Free Tailoring Machine How to Apply

ప్రస్తుతం ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం Free Tailoring Machine స్కీమ్ గ్రామ వార్డు సచివాలయాలలో అప్లై చేసుకోవచ్చు అని మంత్రి సవిత గారు తెలపడం జరిగింది. కాబట్టి అర్హులైన లబ్ధిదారులందరూ మీ దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయంలోకి వెళ్లి అప్లై చేసుకోండి. ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియాలంటే పైన ఇచ్చిన వీడియో లింక్ ని క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

AP Ration Card eKYC Status WhatsApp
AP Ration Card eKYC Status WhatsApp ద్వారా ఎలా చెక్ చేయాలి? పూర్తి వివరాలు
Latest Jobs & Schemes
నవోదయలో 1377 జాబ్స్ రిలీజ్ Click Here
10th పాస్ అయితే చాలు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ Click Here
Farmer Registry Status ( Pending/ Aprove/ Rejecte ) Click Here
32,438 రైల్వే ఉద్యోగాలు రిలీజ్ Click Here
ఫ్రీగా వాట్సాప్ లోనే కరెంట్ బిల్ పే చేయండి Click Here
Latest Article’s : Free Tailoring Machine: మహిళలకు ఉచితంగా 1 లక్ష కుట్టు మిషన్లు

గమనిక :: ప్రతి రోజూ ప్రభుత్వ పథకాలు, జాబ్స్ కోసం మా వెబ్ సైట్ మరియు వాట్సాప్ గ్రూప్ నీ ఫాలో అవ్వండి. అలాగె తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు..

🔍 Related TAGS

free sewing machine scheme, ap government free tailoring machine, sewing machine, free sewing machine, sewing machine scheme, free tailoring machine, free tailoring machine scheme, how to apply free sewing machine scheme online, how to apply free tailoring machine scheme, free sewing machine scheme in ap, free sewing machine scheme for women in ap, free sewing machine scheme 2025 apply online, free sewing machine scheme in Andhra Pradesh

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇