
Table of Contents
Ap Subsidy Loans 2025 Last Date, Apply Process
Ap Subsidy Loans 2025 Last Date, Apply Process : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని కులాల ప్రజల కోసం స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం తీసుకొచ్చారు. అయితే ఈ పథకాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ల జాయిన్ అవ్వండి.
Overview of the Ap Subsidy Loans 2025 Last Date, Apply Process
మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టింది.2024-2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బి.సి. కార్పొరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు కాపు కార్పొరేషన్ లకు సంబంధించిన లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్, కృష్ణ వారి ద్వారా వివిధ పథకముల ద్వారా సబ్సిడి మంజూరు చేయుటకు గాను, దరఖాస్తుదారులు AP-OBMMS ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చును అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేశారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని కులాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారికి మంచి ఉపాధిని కల్పించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
Ap Subsidy Loans Eligibility
ఈ స్వయం ఉపాధి పథకాలకు అప్లై చేసుకోవాలంటే లబ్ధిదారులు కొన్ని అర్హతలను పొంది ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- అన్ని వనరులు కలుపుకొని పట్టణ ప్రాంతము వారి ఆదాయం రూ.1,03,000 రూపాయలు, మరియు గ్రామీణ ప్రాంతము వారి ఆదాయం రూ.81,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
- 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల వారు అర్హులు.
- కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులముల వారికి అయితే 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండవలెను.
- మేదర కులములకు చెందిన వారు బుట్టల అల్లకం పథకమునకు,కుమ్మరి/శాలివాహన కులములకు చెందినవారికి కుండల తయారీ పథకమునకు ప్రత్యేకముగా దరఖాస్తు చేసుకోవచ్చును.
- తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండవలెను.
- ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒకరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.
- వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా,విభాగము వంటి సెక్టర్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును.
ఈ అర్హతలు కలిగిన లబ్ధిదారులు మాత్రమే ఈ స్వయం ఉపాధి పథకాలకు అర్హులు అవుతారు.
Ap Subsidy Loans 2025 Full Details
ఈ స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులు ఏ కమ్యూనిటీ వారు ఏ కార్పొరేషన్ లకు అప్లై చేసుకోవచ్చునో వివరంగా ఇప్పుడు చూద్దాం.
- బిసి కార్పొరేషన్ :- బీసీలు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చును.
- ఇబిసి కార్పొరేషన్ :- ఇబిసి కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు
- కమ్మ కార్పోరేషన్ :- కమ్మ కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు
- రెడ్డి కార్పోరేషన్ :- రెడ్డి కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు
- ఆర్యవైశ్య కార్పొరేషన్ :- ఆర్యవైశ్య కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు
- క్షత్రియ కార్పొరేషన్ :- క్షత్రియ కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు
- బ్రాహ్మణ కార్పొరేషన్ :- బ్రాహ్మణ కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు
- కాపు కార్పొరేషన్ :- కాపు (ఓసి-కాపు,బలిజ,తెలగ,ఒంటరి) కులముల వారు మాత్రమే
ఇలా ఏ కమ్యూనిటీ వారు ఆ యొక్క కార్పొరేషన్ లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.
Also Read:- లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు :: Click Here
Ap Subsidy Loans 2025 Last Date
ఈ పథకాలకు అప్లై చేసుకునే లబ్ధిదారుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు.2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బి.సి. కార్పొరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు కాపు కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్, కృష్ణా వారి ద్వారా విధిగా పథకముల ద్వారా సబ్సిడీ మంజూరు చేయుటకు గాను, దరఖాస్తులు AP-OBMMS ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకొనుటకు మొదటి తేదీ మరియు చివరి తేదీ లు కింద ఇవ్వబడినవి.
Apllication Starting Date : 10-03-2025.
Application Last Date : 25-03-2025.
Ap Subsidy Loans 2025 Apply Online Process
ఈ సబ్సిడీ లోన్స్ మనము ఫ్రీగా ఆన్లైన్లో లోనే అప్లై చేసుకోవచ్చును.. ఎలానో క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి.. మరియు మీ మొబైల్ లో మీరే అప్లై చేసుకోండి.
గమనిక :: పైన లింకును క్లిక్ చేసుకొని ఫ్రీగా సబ్సిడీ లోన్ అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఎలా చేసుకోవాలో తెలియకపోతే క్రింద ఇచ్చిన డెమో వీడియోని క్లిక్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
BC Corporation Loans Apply Process
📽️ Demo Video :: Click Here
OC Corporation Loans Apply Online
📽️ Demo Video :: Click Here
Ap Subsidy Loans 2025 Required Documents
ఈ Ap Subsidy Loans 2025 Apply చేయాలంటే తప్పకుండా క్రింది తెలిపిన డాక్యుమెంట్ అన్ని ఉండాలి.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- క్యాస్ట్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి
- ఇన్కమ్ సర్టిఫికెట్
ఫ్రెండ్స్ ప్రతిరోజు మీరు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ లేదా వెబ్సైట్ నీ ఫాలో అవ్వగలరు. అలాగే మీ తోటి మిత్రులకు ఈ పేజీని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Latest Article’s : Ap Subsidy Loans 2025 Last Date, Apply Process: ఫ్రీగా 5 లక్షల సబ్సిడీ లోన్స్- Ap New Ration Card Release Date: ATM కార్డు లాంటి కొత్త రేషన్ కార్డులు త్వరలో ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అవుతున్నాయి
- AP Inter Results 2025: నేరుగా మీ వాట్సాప్ లోనే ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- Banks Open : 31వ తేదీన కూడా బ్యాంకులు ఓపెన్ లో ఉంటాయి
- Ration Card Ekyc Last Date: రేషన్ కార్డుల ఈ కెవైసీ గడువు పెంపు
🔍 Related TAGS
bc corporation subsidy loans 2025, bc corporation loans 2025, telangana handicapped subsidy loans 2025, subsidy loans, ap subsidy loans, telangana bc corporation subsidy loans 2025, bc corporation subsidy loans application 2025, corporation loans, telangana sc corporation subsidy loans, bc corporation loans apply, bc corporation loans, handicapped subsidy loans 2025, sc corporation loans, how to apply corporation loans, bc corporation subsidy loans
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇