
Table of Contents
AP Inter Results 2025
AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రతి ఏడాది లాగా కాకుండా ఈ సారి డైరెక్ట్ గా పేరెంట్స్ యొక్క వాట్సాప్ కు ఫలితాలను పంపుతారు. అయితే ఏ విధంగా ఫలితాలను పంపుతారు.. ఎలా చెక్ చేసుకోవాలి..పూర్తి వివరాలు ఈ పేజీ లో తెలుసుకుందాం.ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AP Inter Results 2025
ఆంధ్రప్రదేశ్ లోనీ ఇంటర్ విద్యార్థులు ఈ మధ్యనే వారి యొక్క పరీక్షలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు ఇంటర్ విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రుల ఆలోచన మొత్తం ఇంటర్ ఫలితాల పైనే ఉంది.
AP Inter Paper Valuation Details
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మార్చి 17వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ పరీక్షలు పూర్తి అయిన సంగతి తెలిసినదే. అయితే మార్చి 19 నుంచి పేపర్ వాల్యుయేషన్ జరగడం మొదలైనది. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు.కాబట్టి ఈ విద్యార్థుల అందరి ప్రశ్నాపత్రాలను వాల్యుయేషన్ చేయడానికి మరియు వాటి యొక్క ఫలితాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి కాస్త సమయం పడుతుంది. ముందుగా ఈ ప్రశ్నాపత్రాలను వాల్యుయేషన్ చేయడం మార్చి 19 నుండే ప్రారంభం అయినప్పటికీ ఇది ఏప్రిల్ 10వ తేది కి ముగియనుంది. ఈ వాల్యుయేషన్ పూర్తి అయిన వెంటనే మిగతా ప్రాసెస్ లను ప్రారంభిస్తారు, దీనికి ఒక వారం సమయం పడుతుంది. దీనిని అంతా దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ మూడవ వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు సిద్ధపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ నెలలోనే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయి.
ఏపీ ఇంటర్ వాల్యుయేషన్ అనుకున్న దానికన్నా కూడా వేగంగా జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 కేంద్రాలను వాల్యుయేషన్ కోసం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ అధికారులు సమాచారం ఇచ్చారు.ఈ పేపర్ కరెక్షన్స్ కు 20 వేలకు పైగా టీచర్ లను ఏర్పాటు చేశారు. ఇంతమంది ఇబ్బందులు ఉండడం వలన వాల్యుయేషన్ తొందరగా పూర్తి అవ్వడంతో పాటు ఫలితాలను కూడా తొందరగా విడుదల చేయవచ్చు.
AP Inter Results Will Release In Two Types
ప్రతీ సంవత్సరం ఆంధ్రాలో ఇంటర్మీడియట్ ఫలితాలను ఆన్లైన్ లో విడుదల చేస్తారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ లో విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకునేవారు. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో అనేక మార్పులు చేశారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలను సంప్రదాయ పద్ధతితో పాటు వాట్సాప్ లో కూడా విడుదల చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను విడుదల చేయబోయే రెండు విధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- To Parents WhatsApp Number
- In Online
పైన ఇచ్చిన విధానములు ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలు విడుదల చేయబోతున్నారు. అయితే వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Latest Govt Jobs :- Click Here
To Parents WhatsApp Number
ఈ ఏడాది సరికొత్తగా ఇంటర్ ఫలితాలను సంప్రదాయ పద్ధతితో పాటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్ కు డైరెక్ట్ గా ఫలితాలను విడుదల చేయబోతున్నారు. అధికారులు ఫలితాలను విడుదల చేసిన 10 నిమిషాల నుండి 20 నిమిషాల మధ్యలోనే ఫలితాలను విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నెంబర్ కు వాట్సాప్ లో పంపిస్తారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు బోథ్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ విధంగానే ఫలితాలను పంపిస్తారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అయితే మొదటి సంవత్సరం ఫలితాలను, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అయితే మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాలను పంపిస్తారు. ఈ మార్క్స్ షీట్ ను విద్యార్థులు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ మార్క్స్ షీట్ ను విద్యార్థులు ఒరిజినల్ మార్క్ షీట్స్ వచ్చేవరకు ఉపయోగించుకోవచ్చు.
In Online
ప్రతి ఏటా ఇంటర్మీడియట్ మరియు అనేక తరగతులు చదువుతున్న విద్యార్థులకు వారి యొక్క ఫలితాలను సంప్రదాయ పద్ధతిలో అందరికీ సౌకర్యంగా ఉండేలాగా ఆన్లైన్ లో వారి యొక్క ఫలితాలను విడుదల చేస్తారు. ఇలా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్ సైటు లో చూడవచ్చు. అధికారిక వెబ్సైట్ తో పాటు ఇతర వెబ్సైట్లో కూడా ఈ ఫలితాలను చూడవచ్చు. ఎలాగైతే విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్స్ ను అధికారిక వెబ్సైట్ ద్వారా పొందారో అదేవిధంగా ఈ ఫలితాలను కూడా ఆన్లైన్ లో చూసుకొని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం విద్యార్థులు వారి యొక్క రూల్ నెంబర్ (హాల్ టికెట్ నెంబర్) మరియు వారి పుట్టిన తేదీ నీ ఎంటర్ చేయవలెను. ఇలా ఆన్లైన్ లో ఫలితాలు విడుదలైన వెంటనే చెక్ చేసుకోవచ్చు.
AP Inter Results Release Date : 3rd Week Of April(Expected)
What Is WhatsApp Governence
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సేవలలో ఒక అద్భుతమైన సేవ ఈ వాట్సాప్ గవర్నెన్స్. ఇది ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడే సేవ. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ను ‘మన మిత్ర’ అనే పేరుతో మన ప్రభుత్వం ప్రారంభించింది. మన దేశంలో ఏ రాష్ట్ర లోను ఇటువంటి సేవ చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఒక సేవలు తీసుకురాలేదు కానీ మన ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో మొత్తం 250కి పైగా సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 9552300009 నెంబర్ కి మెసేజ్ చేసి మీకు అందుబాటులో ఉన్న సేవలను తెలుసుకోవచ్చును. ఎన్నో రకాల ఆన్లైన్ సేవలు దాదాపు అన్ని సేవలను ఈ వాట్సాప్ గవర్నెన్స్ నీ ఉపయోగించి సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు అని ప్రభుత్వం తెలిపింది. మీరు మీ కరెంటు బిల్లును కూడా దీని ద్వారా కట్టవచ్చు. ఇప్పటికే దాదాపు 250కి పైగా సేవలు ఉన్న వాటిని మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సంవత్సరము ఏప్రిల్ నాటికి ఈ సేవల యొక్క సంఖ్యను 300 కు పెంచబోతున్నారు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇంకొన్ని ముఖ్యమైన పథకాలు మరియు సబ్సిడీ లోన్స్
రేషన్ కార్డ్ ఈ కేవైసీ స్టేటస్ | Click Here |
PM Internship Scheme ప్రతి నెల రూ 5,000 | Click Here |
SBI గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ | Click Here |
50 వేల నుండి 50 లక్షల వరకు మహిళలకు లోన్స్ | Click Here |
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ | Click Here |
ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు స్టేటస్ | Click Here |
మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా రాలేదా | Click Here |
గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ నీ లేదా ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేస్తూ ఉండండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
🔍 RELATED TAGS
ap inter results 2025 date, ap inter results 2025, ap inter results 2025 latest news, ap inter results 2025 today news, ap inter results 2025 latest update, ap inter results 2025 latest news date, binter results 2025 ap, inter results 2025 ap date, ap intermediate results 2025, ap intermediate results 2025 date, intermediate results 2025 ap date, ap inter results 2025 release date, ap intermediate results 2025 latest update, ap inter results release date 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇